Kerala: కేరళలో రేబిస్ కలకలం..ఒకే నెలలో ముగ్గురు చిన్నారులు మృతి

by Ajay Maddhiboyina |

కేర‌ళ‌లో రేబిస్ వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలో ఒకే నెల‌లో రేబిస్ కార‌ణంగా ముగ్గురు చిన్నారులు మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Kerala: కేరళలో రేబిస్ కలకలం..ఒకే నెలలో ముగ్గురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కేర‌ళ‌లో రేబిస్ వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలో ఒకే నెల‌లో రేబిస్ కార‌ణంగా ముగ్గురు చిన్నారులు మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా కుక్క కాటుకు రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారి సైతం రేబిస్‌తో మరణించింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన నియా ఫైజల్ ను కొద్దిరోజుల క్రితం కుక్క కరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో చిన్నారిని కుక్క కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్ ఇప్పటించారు. మొత్తం చిన్నారికి మూడు డోసుల వ్యాక్సిన్ వేశారు.

అయినప్పటికీ రెండు వారాల తరవాత చిన్నారి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. చివరికి రేబిస్ వ్యాధి ముదిరి చికిత్స పొందుతూ కన్నుమూసింది. రేబిస్ సోకిన జంతువు మెడ, తల, చేతులు లాంటి నరాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరిస్తే వైరస్ త్వరగా మెదడుకు చేరుతుందని కొన్నిసార్లు వ్యాక్సిన్ కూడా పనిచేయకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పుల్లాడ్, మలప్పురంలోనూ ఇద్దరు చిన్నారులు రేబిస్ లక్షణాలతోనే మణించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story