- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: ఒకటో తరగతి ప్రవేశాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. ఒకటో తరగతిలో చేరాలనుకునే చిన్నారులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించవద్దని కేరళ విద్యామంత్రి(Kerala Education Minister) వి. శివన్ కుట్టి వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. ఒకటో తరగతిలో చేరాలనుకునే చిన్నారులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించవద్దని కేరళ విద్యామంత్రి(Kerala Education Minister) వి. శివన్ కుట్టి వెల్లడించారు. ఈ పద్ధతిని క్రూరత్వం అని అన్నారు. ఒకటోతరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు లేదా తల్లిదండ్రుల ఇంటర్వ్యూలు నిర్వహించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యను కొన్ని సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. “ఒకటో తరగతి ప్రవేశ పరీక్షల తర్వాత తల్లిదండ్రులకు ఇంటర్వ్యూ కూడా ఉంది. ఈ ఇంటర్వ్యూలో పాస్ అయ్యేందుకు తల్లిదండ్రులు కష్టపడి చదువుతున్నారు. ఇవేవీ ఆమోదయోగ్యం కాదు. ఒకటో తరగతి చిన్నారులకు విద్యా సంబంధిత భాగాలను బోధించవద్దని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఎగ్జామ్స్, బుక్స్ లేకుండా చిన్నారులు సంతోషంగా పాఠశాలలకు రావాలి. విలువలను అర్థం చేసుకోనివ్వండి ”అని ఆయన అన్నారు.
పీటీఏ ఫీజుపై ఆందోళన
పాఠశాలల్లో పేరెంట్-టీచర్ అసోసియేషన్ (PTA) ఫీజుల గురించి శివన్‌కుట్టి ఆందోళన వ్యక్తం చేశారు.“ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు అయినా, వారు ప్రతి తరగతికి పీటీఏ ఫీజుగా రూ. 25, రూ. 50 లేదా రూ. 100 మాత్రమే వసూలు చేయాలి. కొన్ని విద్యాసంస్థలు రూ.5000 వరకు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి పాఠశాలలపైనా కఠఇన చర్యలు తీసుకుంటాం” అని ఆయన అన్నారు. ఇకపోతే, కొన్నిరోజుల క్రితం పదిహేనేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఈ సూసైడ్ పై సమగ్ర విచారణ జరపాలని జనరల్ ఎడ్యకేషన్ డైరెక్టర్ కు విద్యామంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్కూల్లో ర్యాగింగ్ బెదిరింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు బాలుడు కుటుంబం ఆరోపిస్తుంది.






