- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థరూర్ మాలో ఒకడు కాదు.. పార్టీ కార్యకలాపాలకు ఇకపై పిలవం:కేరళ కాంగ్రెస్
థరూర్ తమలో ఒకడు కాదని, దేశ భద్రపై స్టాన్స్ మార్చుకోకుంటే పార్టీ కార్యకలాపాలకు పిలవబోమని కేరళ కాంగ్రెస్ వార్నింగ్ ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: సీనియర్ నేత శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుతోందని వస్తున్న వార్తలకు తాజాగా మరో సీనియర్ నేత కె. మురళీధరన్ మరింత ఆజ్యంపోశారు. జాతీయ భద్రత విషయంలో తన మాట మార్చుకునే వరకూ తిరువనంతపురంలో జరిగే ఏ పార్టీ కార్యకలాపాలకు థరూర్‌ను తాము పిలవబోమని మురళీధరన్ స్పష్టంచేశారు. థరూర్‌ను తమలో ఒకడిగా చూడటం లేదని, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మురళీధరన్ వెల్లడించారు.
పార్లమెంటు సమావేశాల్లో పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై కేంద్రాన్ని కార్నర్ చేయాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలన్నీ అనుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉన్న థరూర్‌ను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టాలని కేరళ కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తనకు ఎప్పుడూ దేశమే ముఖ్యమని, ఆ తర్వాతే పార్టీ వస్తుందని తాజాగా థరూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.






