- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ సీఎం పోస్ట్.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద అసలేం జరిగింది?
కేరళ కొత్త సీఎంగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ ఖరారు చేసింది. రాహుల్, సోనియా అంచనాలను కాదని ప్రియాంక గాంధీ మద్దతు ఉన్న సతీశన్‌కే పీఠం దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ సీఎం పోస్టుపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. తదుపరి ముఖ్యమంత్రిగా వీడి సతీశన్‍ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఈ పదవి కోసం రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్, సీనియర్ నేత రమేశ్ చెన్నితాల, వీడి సతీశన్ మధ్య గట్టి పోటి నెలకొన్నప్పటికీ చివరకు సతీశన్‍కు ఈ పదవి వరించింది. అయితే ఈ పదవి ఎంపిక ఎంతో అనుభవం కలిగిన కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పార్టీ శ్రేణులను తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరకు తన అభిప్రాయం కంటే రాష్ట్రంలోని క్షేత్ర స్థాయి ఒత్తిళ్ల వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గాంధీ కుటుంబంలో ట్రైయాంగిల్ చర్చ!:
కేరళ సీఎం పోస్టు గాంధీ కుటుంబంలోనూ తీవ్ర చర్చగా మారినట్లు జాతీయ స్థాయిలో టాక్ వినిపస్తోంది. ఇక్కడ ప్రధానంగా రేస్‍లో ఉన్న కేసీవేణుగోపాల్ విషయంలో రాహుల్ గాంధీ సానుకూలంగా ఉండగా సోనియా గాంధీ మాత్రం సీనియారిటీ అనుభవంతో పాటు అత్యున్నత పదవి కోసం చివరి అవకాశంపై ఆధారపడిన సీనియర్ నాయకుడైన రమేష్ చెన్నితాల పట్ల ఎక్కువ సానుభూతితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రియాంక గాంధీ మాత్రం సతీశన్ కు అనుకూలంగా ఉన్నారని ఈ ట్రయాంగిల్ పోరులో చివరాఖరుకు ప్రియాంక గాంధీ అంచనా నెగ్గినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 47 మంది కేసీవేణుగోపాల్‍కు మద్దతు తెలిపినా రాహుల్ గాంధీ మాత్రం తుది లైన్ క్రాస్ చేయలేకపోయారని ఇందుకు కేరళ కాంగ్రెస్ నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతే కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వేణుగోపాల్ కేవలం ఢిల్లీ ప్రతినిధిగా మాత్రమే అనే అభిప్రాయం ఉండగా సతీశన్‍కు మాత్రం క్షేత్రస్థాయిలో, మిత్రపక్షాల నుంచి మద్దతు లభించడం అధిష్టానం అభిప్రాయాన్ని సైతం మర్చివేసేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోసారి తెరపైకి ప్రియాంక పేరు:
తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి ప్రియాంక గాంధీ ప్రాముఖ్యతపై చర్చ జరుగుతోంది. జాతీయ కాగ్రెస్‍లో రాహుల్ స్థానంలో ప్రియాంక గాంధీకి ప్రాధాన్యత అవకాశాలు ఇవ్వాలనే టాక్ వినిపిస్తూనే ఉంది.ఇప్పుడు కేరళ సీఎం అంశంలో కేవలం ఇది కేవలం సతీశన్ విజయం మాత్రమే కాదని ఇది కేసీ వేణుగోపాల్ ఓటమి అని అంతకంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రతిష్టకు సంబంధించిన అంశం అనే చర్చ బలంగా జరుగుతున్న వేళ గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‍లో జరిగిన పరిణామాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో రాహుల్ కు బదులు ప్రియాంకకు ప్రయార్టీ ఇవ్వడం ద్వారా పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చనే చర్చ మరోసారి చర్చగా మారింది.






