- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Wayanad Landslide: కేరళ లారీ డ్రైవర్ అర్జున్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం పినరయ్ విజయన్
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని షిరూర్‌లో కొండచరియలు విరిగిపడి గల్లంతైన కేరళ లారీ డ్రైవర్ అర్జున్ ఇంటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం సందర్శించారు. అర్జున్ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పినరయ్ విజయన్ లేఖ పంపారు. 'చాలా కాలంగా అర్జున్ తప్పిపోయినందున అతని కుటుంబం ఆందోళనలో ఉంది. వారి బాధను మీకు తెలియజేయాలని లేఖ పంపుతున్నాను. సెర్చ్ ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నానని ' లేఖలో పేర్కొన్నారు. అర్జున్ తల్లిదండ్రులు, భార్య, కుమారుడు సహా అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీలైనంత తొందరగా గాలింపు చర్యలు చేపట్టాలని అర్జున్ కుటుంబసభ్యులు ముఖ్యమంత్రిని విన్నవించారు. వయనాడ్‌లో అనేక కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని, అర్జున్ కుటుంబ సమస్యను పరిగణలోకి తీసుకోనున్నట్టు విజయన్ హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా దక్షిణాదిన పలు ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయి. ఈ క్రమంలోనే అంకోలా నుంచి కేరళకు వెళ్తున్న ఆ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అర్జున్ జూలై 16న అదృశ్యమయ్యాడు.