- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madhya Pradesh: మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి డెడ్ బాడీని కుక్కలు పీక్కొని తిన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి డెడ్ బాడీని కుక్కలు పీక్కొని తిన్నాయి. కాగా.. బాణాపుర ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల నిఖిల్ చౌరాసియా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పెళ్లి వేడుక తర్వాత స్నేహితులతో కలిసి బైక్ పై తిరుగు ప్రయాణమయ్యాడు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్ ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఆస్పత్రికి తరలించే లోగా చనిపోయాడు. అయితే, అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫ్రీజర్ లేకపోవడం వల్ల హాస్పిటల్ ప్రాంగణంలోనే యువకుడి డెడ్ బాడీని ఉంచారు. అయితే, రాత్రివేళ కుక్కలు ఆ డెడ్ బాడీని పీక్కుని తిన్నాయి. తెల్లవారుజామున దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసుపత్రి భవనం పాతది కావడంతో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ సౌకర్యం లేదని సివిల్ సర్జన్ డాక్టర్ సుధీర్ విజయవర్గియా తెలిపారు. దీంతో మృతదేహాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారని చెప్పారు. పర్యవేక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను నియమించినట్లు వెల్లడించారు. అయితే డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ గార్డులకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని ఆయన వివరించారు.






