మమత బెనర్జీతో భేటీ అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మమత బెనర్జీతో భేటీ అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంతో అనేక సమస్యలపై నిత్యం పెనుగులాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు పార్టీ నేతలతో కలిసి పశ్చిమ బెంగాల్ వెళ్లిన కేజ్రీవాల్ అక్కడ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రం బెదిరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ బృందం మమతతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్‌కు మమతా సపోర్ట్‌గా నిలిచారు.

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మమత కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ పోరాటాన్ని సమర్ధిస్తామన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదని విపక్షాలను కేంద్రం అణగదొక్కుతోందని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దర్యాప్తు సంస్థళను కంట్రోల్ చేయాలని కేంద్ర చూస్తోందని ప్రభుత్వం 'ఆఫ్ ద ఎజెన్సీ, బై ద ఎజెన్సీ, ఫర్ ద ఎజెన్సీ' ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మారుస్తుందేమోన అని భయం ఉందని రేపో మాపో దేశం పేరు కూడా మారుస్తారనే ఆందోళ వ్యక్తం చేశారు. అయితే ఆప్ పోరాటానికి నితీష్ కుమార్, కాంగ్రెస్ తో పాటు మరి కొన్ని పార్టీలు అడగా నిలిచిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ నో రెస్పాన్స్:

ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్ కు అండగా విపక్షాలన్ని ఎకతాటిపైకి వస్తున్నాయి. క్రమంగా కేజ్రీవాల్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించకోపోవడం హాట్ టాపిక్ అయింది. కేజ్రీవాల్‌కు కేసీఆర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల కేసీఆర్ చేపట్టిన పలు కార్యక్రమాలకు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం టైమ్ లో దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. కానీ కేజ్రీవాల్ సర్కార్ కు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విషయంలో గులాబీ బాస్ రియాక్ట్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కర్ణాటక ఫలితాల అనంతరం మమత బెనర్జీతో పాటు కేజ్రీవాల్ సైతం కాంగ్రెస్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న మిత్రుడికి కేసీఆర్ అండగా ఉంటారా లేక హ్యాండిస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.


Next Story

Most Viewed