కేజ్రీవాల్ కస్టడీ.. మరోసారి పొడిగింపు!

by Geesa Chandu |

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని.. రౌస్ అవెన్యూ కోర్ట్ మంగళవారం(ఆగస్టు 27) మరోసారి పొడిగించింది.

కేజ్రీవాల్ కస్టడీ.. మరోసారి పొడిగింపు!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని.. రౌస్ అవెన్యూ కోర్ట్ మంగళవారం(ఆగస్టు 27) మరోసారి పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో, కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 3 వరకు అవెన్యూ కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గవ అనుబంధ చార్జిషీట్ పైన.. రౌస్ అవెన్యూ కోర్ట్ తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3 వ తేదీన విచారణ జరగనుంది. అయితే, మరో వైపు ఇదే కేసుకు సంబంధించి బీఆరెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవాళ బెయిల్ మంజూరైంది. సుప్రీం కోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2024, మార్చి 15 వ తేదీన కవిత ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story