- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిసోడియా అరెస్ట్‌పై ఎమ్మెల్యేలకు, కౌన్సిలర్లకు సీఎం కేజ్రీవాల్ కీలక ఆదేశాలు
by Vinod kumar |
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

X
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల అరెస్టును నిరసిస్తూ ఇంటింటా వ్యతిరేక ప్రచారం చేపట్టాలని కోరారు. సిసోడియా అరెస్టు నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఎమ్మెల్యే లు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. అరెస్ట్ ల వెనుక బీజేపీ కుట్ర కోణాన్ని ప్రజలకు వివరించాలని ఆయన ఎమ్మెల్యే లకు సూచించారు.
ఢిల్లీ ఆరోగ్య, విద్య మోడల్స్ విజయంతో బీజేపీకి ఆందోళనకు గురై సిసోడియా, జైన్‌లను జైలుకు పంపారని ప్రజలకు తెలియజేయాలని కోరారు. అంతేకాకుండా తాజా సమావేశంలో భవిష్యత్తు కార్యచరణను ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Next Story






