నేను జైలు నుంచి బయటకు వచ్చేలోపే మాయం చేశారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

నేను జైలు నుంచి బయటకు వచ్చేలోపే మాయం చేశారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని "హైజాక్ చేసి, ఖూనీ చేస్తోందని" ఆయన ఆరోపించారు. దేశం ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభంలో ఉందని ఆయన హెచ్చరించారు. 2025 ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమిని గుర్తు చేస్తూ, బీజేపీ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు 'ఓట్ల తొలగింపు' అనే వ్యూహాన్ని అమలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. బెంగాల్‌లో కూడా ఇదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. "నేను జైలుకు వెళ్ళకముందు నా నియోజకవర్గంలో (న్యూఢిల్లీ) 1.48 లక్షల ఓట్లు ఉండేవి. నేను తిరిగి వచ్చేసరికి అవి 1.06 లక్షలకు పడిపోయాయి. కేవలం ఆరు నెలల్లో 42 వేల ఓట్లను తొలగించారు. గత ఎన్నికల్లో నేను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను, కానీ ఈసారి 42 వేల ఓట్లను క్యాన్సిల్ చేయడం వల్ల నేను 3 వేల ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చింది" అని కేజ్రీవాల్ వివరించారు.

దేశవ్యాప్త పరిస్థితి..

హార్, మహారాష్ట్రల్లో కూడా ఇలాంటి గందరగోళమే సృష్టించారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను బీజేపీ 206 స్థానాల్లో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. గతంలో 212 స్థానాలు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఇక అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 206 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా, గౌరవ్ గొగోయ్ వంటి కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఓట్ల తొలగింపు వంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Next Story