- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
kejriwal: ఢిల్లీ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్
ప్రస్తుతం జరగబోయే ఢిల్లీ ఎన్నికలు రెండు సిద్దాంతాల మధ్య పోరు అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రెండు సిద్దాంతాల మధ్య పోరు అని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) అన్నారు. ఈ ఎన్నికలు కేవలం దేశ రాజధానికి మాత్రమే పరిమితం కాదని యావత్ దేశానికే పోటీ అని తెలిపారు. రెండు విరుద్ధమైన భావజాలాలను కలిగి ఉన్న సిద్దాంతాల మధ్య పోరు నెలకొందన్నారు. ఒకరు సాధారణ ప్రజల సంక్షేమంపై పోరాడుతుంటే, మరోవైపు సంపన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడంలో నిమగ్నమై ఉన్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ‘కేజ్రీవాల్ మోడల్’ లేదా ‘బీజేపీ మోడల్’ ఏ మోడల్‌ను అవలంబించాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీ మోడల్‌లో ప్రజాధనం వారి ధనిక స్నేహితుల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత ఐదేళ్లలో సుమారు 400-500 మందికి 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. ఆప్ మోడల్, ఉచిత విద్యుత్, విద్య, వైద్యం, రవాణా సామాన్యులకు ప్రయోజనం చేకూర్చడానికి తోడ్పడుతుందన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఆప్ ప్రారంభించిన అన్ని సంక్షేమ పథకాలకు స్వస్తి పలకాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణాలు, ఢిల్లీ ప్రభుత్వం అందించే ఇతర ప్రయోజనాలను నిలిపివేస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బడా వ్యాపార వేత్తలకు రాయితీలు ఇస్తూనే మధ్యతరగతి ప్రజల్లో అపరాధ భావాన్ని సృష్టించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.






