- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kejriwal : మరో కీలక హామీని అనౌన్స్ చేసిన కేజ్రీవాల్
ఢిల్లీలో 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలో 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 24 గంటల నీటి సరఫరా ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఇదే తరహాలో నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గడవు సమీపిస్తుండటంతో కేజ్రీవాల్ వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. సోమవారం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందించే ‘సంజీవని యోజన’ పథకాన్ని అనౌన్స్ చేశారు. దీంతో 20-25లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఢిల్లీలో నివసించే మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దళిత విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.






