- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటకులు, భక్తులకు బిగ్ అలర్ట్.. కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
ప్రకృతి అందాలకు, ఆద్యాత్మికతకు కేంద్ర బిందువు అయిన కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి అందాలకు, ఆద్యాత్మికతకు కేంద్ర బిందువు అయిన కేదార్‌నాథ్ ఆలయాన్ని (Kedarnath Temple) ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. పెరిగిపోయిన సోషల్ మీడియా యుగంలో భక్తుల, పర్యాటకుల తాకిడి కేదార్ నాథ్ కు భారీగా పెరిగింది. అయితే కొద్ది నెలల క్రితం తెరుచుకున్న ఈ ఆలయాన్ని అధికారులు ఈ రోజు ఉదయం మూసివేశారు. హిమాలయాల్లో ఉన్న పవిత్ర కేదార్‌నాథ్ దేవస్థానం ఈరోజు శీతాకాలం కారణంగా మూసివేయబడింది. కాగా భాయ్ దూజ్ పండుగ రోజున ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా మూసివేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసి వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి శీతాకాల సమర్పణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా మూసివేశారు. దీనికి ముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ద్వారాలు మూసిన తర్వాత పంచముఖి డోలీ ఉత్సవ రీతిలో ఉఖీమఠ్‌కు బయలుదేరింది. అక్కడే శీతాకాలం మొత్తం భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.






