- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేదార్‍నాథ్‍కు పోటెత్తిన భక్తులు.. మూడ్రోజుల్లో రికార్డుస్థాయిలో దర్శనాలు
by Naga Rani Yarlagadda |
కేదార్ నాథ్ లో భక్తుల రద్దీ భారీగా ఉంది. మూడ్రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్న మూడ్రోజుల్లోనే 90 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం రోజున హిమాలయాల్లో ఉన్న కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరచుకున్నాయి. ఆరంభంలోనే భక్తులు భారీగా తరలిరావడం సంతోషంగా ఉందని రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు. తొలిరోజైన ఏప్రిల్ 22నే అత్యధికంగా 38000 మంది, రెండోరోజు 25,000 మందికి పైగా, మూడోరోజు 30,000 మందికి పైగా యాత్రికులు కేదార్ నాథ్ లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వివరించారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
Next Story






