6 నెలల తర్వాత తెరచుకోనున్న చార్‌ధామ్ ఆలయాల తలుపులు.. తేదీలివే

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-15 15:39:34  IST  )

చార్ ధామ్ యాత్రల్లో ముఖ్యమైన నాలుగు ఆలయాల ద్వారాలు ఏప్రిల్ నెలలో తెరచుకోనున్నాయి. ఈ మేరకు కేదార్ నాథ్ - బద్రీనాథ్ ఆలయాల కమిటీ అధికారికంగా తేదీలను ప్రకటించాయి.

6 నెలల తర్వాత తెరచుకోనున్న చార్‌ధామ్ ఆలయాల తలుపులు.. తేదీలివే
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నది ఉత్తరాఖండ్ లోని మహా క్షేత్రం కేదార్ నాథ్. శీతాకాలం మంచుతో కప్పబడి ఉండే ఆలయాన్ని కార్తీకమాసం చివరిలో.. అంటే అక్టోబర్ - నవంబర్ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితిని బట్టి మూసివేస్తారు. మరో ప్రసిద్ధ క్షేత్రం బద్రీనాథ్ కూడా అంతే.. ఆరునెలల పాటు మూసివేసి ఉంటుంది. మళ్ళీ వేసవిలో అంటే ఆరు నెలల తర్వాత ఈ ఆలయాలను తెరుస్తారు. తిరిగి ఆరునెలల తర్వాత.. అంటే ఏప్రిల్ నెలలో ఆలయం తెరచుకుంటుంది. మహా శివరాత్రి సందర్భంగా కేదార్ నాథ్.. బద్రీనాథ్ క్షేత్రాలకు సంబంధించి కేదార్ నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీలు ఆలయాలను తెరిచే తేదీలను నిర్ణయించి ప్రకటించారు. ఏప్రిల్ 22న కేదార్ నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే గంగోత్రి యమునోత్రి ఆలయాలు 19 నుండి తెరుచుకుంటాయని ఆలయ కమిటీల ప్రతినిధులు తెలిపారు.

Next Story