KC Venugopal: సీఎం పదవి ఆశించిన మాట నిజమే.. కానీ, అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేను

by Gantepaka Srikanth |

కేరళం ముఖ్యమంత్రిగా సతీశన్ ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

KC Venugopal: సీఎం పదవి ఆశించిన మాట నిజమే.. కానీ, అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేను
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళం ముఖ్యమంత్రిగా సతీశన్ ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవి ఆశించాను. నాతో పాటు చాలా మంది ఆశించారు. కానీ అధిష్టానం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. సతీశన్ ఎంపికపై నేనూ సంతృప్తిగానే ఉన్నాను. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తా. కాంగ్రెస్‌లో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం’ అని కేసీ వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.

కాగా, కేరళం ముఖ్యమంత్రి పీఠం కోసం మొత్తం ముగ్గురు కీలక నేతలు పోటీ పడ్డారు. చివరకు వి.డి. సతీశన్‌వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు దాటుకొని వచ్చిన సతీశన్.. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. కొచ్చిలోని నాయర్ కుటుంబంలో 1964లో జన్మించిన సతీశన్.. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా పని చేశారు. 1996లో పరావూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిపారు. అప్పటి నుంచి వరుసగా.. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీకి ఆయన సేవలను గుర్తించిన హైకమాండ్ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.లత

Next Story