మటన్ లేక వందలాది పెళ్లిళ్లు వాయిదా.. కశ్మీరీలకు కొత్త సమస్య

by Naga Rani Yarlagadda |

భాద్రపద మాసాన్ని శూన్యమాసంగా భావించి.. తెలుగు రాష్ట్రాలు సహా.. కొన్ని రాష్ట్రాల్లో పెళ్లిళ్లు చేయరు.

మటన్ లేక వందలాది పెళ్లిళ్లు వాయిదా.. కశ్మీరీలకు కొత్త సమస్య
X

దిశ, వెబ్‌డెస్క్: భాద్రపద మాసాన్ని శూన్యమాసంగా భావించి.. తెలుగు రాష్ట్రాలు సహా.. కొన్ని రాష్ట్రాల్లో పెళ్లిళ్లు చేయరు. కానీ.. జమ్మూకశ్మీర్లో (Jammu&Kashmir) మాత్రం ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే అక్కడ పెళ్లివిందులో 20-30 రకాల భక్ష్యాలతో వడ్డించే మాంసాహార వంటకం వాజవాన్ లేకపోతే ఆ విందు పూర్తికానట్లే భావిస్తారు. గొర్రెలు, మేకలతో విందు తయారు చేస్తారు. అయితే ఆ వంటలకు కావలసిన గొర్రెలు, మేకలు సప్లై లేకపోవడంతో.. పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిదే కశ్మీరీలకు పెద్ద ప్రాబ్లమ్ గా మారింది.

నార్మల్ డేస్ లో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల నుంచి ప్రతిరోజూ 50 ట్రక్కుల గొర్రెల్ని కశ్మీర్ కు సరఫరా చేస్తారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో శ్రీనగర్ - జమ్ము మధ్య ఉన్న నేషనల్ హైవే 44.. 15 రోజులుగా మూతపడి ఉంది. ఫలితంగా మేకలు, గొర్రెలు సరఫరా నిలిచి మాంసం కొరత ఏర్పడింది. దీంతో జమ్మూకశ్మీర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మొహమ్మద్.. మాంసానికి అడ్వాన్సులు ఇచ్చివారిని పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు 210 కుటుంబాలు పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నాయి. ఇక్కడ నవంబర్ నుంచి చలిగాలుల తీవ్రత పెరుగుతుంది. అక్టోబర్ నెలాఖరు లోపే ఇక్కడ వివాహాలను ముగిస్తారు.

Next Story