- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. వారం రోజుల్లోనే మూడో ఎన్‌కౌంటర్
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ (Indian army) తెలిపింది. ఒక ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన హరిస్ నజీర్ దార్‌గా గుర్తించగా మరొకరి పేరు వెల్లడించలేదు. జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకపాలాలు జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీకి చెందిన చినార్ కార్ఫ్స్ తెలిపింది. ఆపరేషన్ అఖల్ (Operation akhal) ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బలగాలను భారీగా మోహరించారు.
ఎన్ కౌంటర్ లో మరణించిన హరీస్ సీ కేటగిరీ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో వారం రోజుల్లోనే ఇది మూడో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. అంతకుముందు జూలై 28న ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో పహెల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. అలాగే జూలై 31న పూంచ్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.






