- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashmir: ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తుర్కియే.. తీవ్రంగా మండిపడ్డ భారత్
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

దిశ, నేషనల్ బ్యూరో: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత్, పాక్‌ల మధ్య చర్చలు జరగాలన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ఆధారంగా ప్రాబ్లబ్ సాల్వ్ చేసుకోవాలని సూచించారు. కశ్మీర్‌లోని మా సోదర సోదరీమణులకు చర్చల ద్వారా మేలు జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇండియా పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణతో తుర్కియే సంతోషంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత సీజ్ ఫైర్ సాధించడం హ్యాపీగా ఉందని తెలిపారు. అలాగే గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఎర్డోగాన్ ఖండించారు. ప్రపంచం పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని, ఇటీవల ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గతంలోనూ ఎర్డోగాన్ పలుమార్లు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. ఈ విషయంలో పాక్‌కు మద్దతిస్తూ వచ్చారు. ఇండియా పాక్ ఘర్షణ టైంలోనూ పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం.
ఎర్డోగన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని తెలిపారు. దీనిపై వ్యాఖ్యానించడానికి మరే ఇతర దేశానికి హక్కు లేదన్నారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించడం సరికాదని చెప్పారు. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై ఈ తరహా అనవసరమైన ప్రకటనలు ఆయోదయోగ్యం కాదని తెలిపారు. కశ్మీర్ ప్రజలకు అతిపెద్ద ముప్పుగా ఉన్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపడంపై ఎర్డోగన్ మాట్లాడితే బాగుండేదని సూచించారు.






