Kash Patel: భారత్‌, అమెరికాలో దాడులకు హ్యాపీ పాసియా ప్లాన్.. ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ పటేల్

by B.Srinivas |

ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాపై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక ప్రకటన చేశారు.

Kash Patel: భారత్‌, అమెరికాలో దాడులకు హ్యాపీ పాసియా ప్లాన్.. ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ పటేల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాది హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా (Happy pasia) పై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ (Kash patel) కీలక ప్రకటన చేశారు. భారత్, అమెరికాలోని పోలీస్ స్టేషన్లపై దాడులకు పాసియా కుట్ర పన్నారని ఆరోపించారు. ఆయన అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని, విదేశీ ఉగ్రవాద ముఠాలో భాగమని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. పాసియాకు పాకిస్థాన్ కు చెందిన అత్యంత క్రూరమైన గూఢచారి సంస్థ ఐఎస్ఐ, నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘ పాసియా యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్నారు. ఆయన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలో భాగం. భారత్, అమెరికాలోని పోలీస్ స్టేషన్లపై దాడులకు ప్లాన్ చేశారు’ అని తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించిందని, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. హంసను వ్యాప్తి చేసే వారు ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Next Story