లక్షల జీతమున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వైపు.. పిడుగుపాటుకు బలి

by Naga Rani Yarlagadda |

పెద్ద పెద్ద చదువులు చదివి.. సాఫ్ట్ వేర్ కొలువులు చేసేవాళ్లు.. ఒక్కొక్కరిగా బిజినెస్ లు, వ్యవసాయం అంటూ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు.

లక్షల జీతమున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వైపు.. పిడుగుపాటుకు బలి
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్ద పెద్ద చదువులు చదివి.. సాఫ్ట్ వేర్ కొలువులు చేసేవాళ్లు.. ఒక్కొక్కరిగా బిజినెస్ లు, వ్యవసాయం అంటూ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. ఒత్తిడితో సంపాదించే లక్షల జీతంకంటే.. ప్రశాంతంగా వ్యవసాయం, పాడి చేసుకుని జీవించడానికి సరిపడా సంపాదిస్తే చాలనుకుంటున్నారు. అలా అనుకుని వ్యవసాయం బాటపట్టిన 43 ఏళ్ల టెకీ.. ఇప్పుడు పిడుగుపాటుకు బలయ్యాడు. కర్ణాటకలోని మడికెరి టౌన్ కు చెందిన రోషన్ బాలకృష్ణ పిడుగుపాటుకు మృతి చెందాడు. వ్యవసాయం చేసేందుకు మైసూరు సమీపంలో ఓ భూమిని చూసేందుకు తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలోనే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారి పిడుగు పడింది.

రోషన్.. ఇటీవలే తన ఐటీ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంవైపు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భూమిని చూస్తున్న సమీపంలో ఉన్న ఒక మామిడి చెట్టు ఉండగా.. ఆ చెట్టుకున్న కాయల్ని కోసేందుకు రోషన్ అక్కడికి వెళ్లారని, ఆ సమయంలోనే పిడుగు పడిందని పేర్కొన్నారు. అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయి మరణించినట్లు వివరించారు. భూమిని చూపించేందుకు వచ్చిన వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ.. రోషన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. SDRF నుంచి రూ.4 లక్షలు, NDRF నుంచి మరో లక్షరూపాయలు.. మొత్తం రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందిస్తామని తెలిపింది.

Next Story