- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కొడుకుకు ఓ పిల్లను చూసి పెడుతరా.. పోలీసులకు వృద్ధురాలి రిక్వెస్ట్..
by Sujitha Rachapalli |
కర్ణాటక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ‘ఘర్ ఘర్ పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తుమకూరు జిల్లా బదవన్హళ్లిలోని ఓ వృద్ధురాలి ఇంటికి

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ‘ఘర్ ఘర్ పోలీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తుమకూరు జిల్లా బదవన్హళ్లిలోని ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఏదైన సమస్య ఉందా అని అడిగారు. దీనికి ఆవిడ ఇచ్చిన సమాధానానికి అవాక్కయ్యారు. తన కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నానని.. ఓ అమ్మాయిని వెతికి పెట్టమని కోరింది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాని పోలీసులు.. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వృద్ధురాలికి చెప్పి బయలుదేరారు. కాగా ‘ఘర్ ఘర్ పోలీస్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర జూలై 18న ఈ పథకాన్ని ప్రారంభించారు. పోలీసులు ఇంటింటికీ వెళ్లే ఈ పథకం దేశంలోనే తొలిసారి అని తెలిపారరు.
Next Story






