- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట ఎఫెక్టు.. ఇకపై 3 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా!
క్రౌడ్ మేనేజ్మెంట్ పై కొత్త బిల్లు తీసుకువచ్చే యోచనలో కర్ణాటక ఉన్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ (RCB) నిర్వహించిన విక్టరీ పరేడ్ (Victory Parade) సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రణాలు కోల్పోయిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కొత్త చట్టం తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈవెంట్ కు ముందు నిర్వహాకులు తప్పనిసరిగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలనే రూల్ తీసుకురాబోతున్నారు. అనుమతి తీసుకోకపోయినా, జనసమూహాన్ని నియంత్రించడంలో విఫలం అయినా లేదా పరిహారం ఇవ్వడంలో విఫలం అయినా ఈ చట్టప్రకారం కఠిన శిక్షణలు అమలు చేసే దిశగా కొత్త నింబంధనలు తీసుకురాబోతున్నది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. 50 వేల జరిమానా లేదా రెండు విధించేలా కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నదని ఈ మేరకు ముసాయిదా బిల్లును సైతం కర్ణాటక ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.






