- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Covid Vaccine: కరోనా టీకాలకు, హార్ట్ ఎటాక్ మరణాలకు సంబంధం లేదు
కాబట్టి ఈ మరణాలకు కొత్త అంశాలు ప్రభావితం చేసి ఉండొచ్చు. మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల చాలామంది యువకుల్లో గుండెపోటు మరణాలకు కోవిడ్ - 19 టీకాయే కారణమనే ఆందోళనలు పెరిగాయి. దీనిపై కర్ణాటకలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఆకస్మిక గుండెపోటు మరణాలకు, కోవిడ్-19 టీకాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చింది. జయదేవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్. రవీంద్రనాథ్ అధ్యక్షతన ఉన్న ఈ ప్యానెల్ తమ పరిశోధనలను సమర్పించింది. హసన్ జిల్లాలో తక్కువ సమయంలోనే ఎక్కువ మరణాలు సంభవించడంపై ఆందోళనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వ మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు ఈ దర్యాప్తు జరిపింది.
మరణాలు వారి జీవనశైలి, సహజ కారణాలతోనే సంభవించవచ్చని నివేదిక తేల్చింది. అనేక కేసుల్లో రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాలు కనిపిస్తాయి. అయితే, ఇటీవలి కేసుల్లో రోగులకు వీటిలో ఏవీ లేవు. కాబట్టి ఈ మరణాలకు కొత్త అంశాలు ప్రభావితం చేసి ఉండొచ్చు. మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.
ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగేందుకు ఇదీ అని ఒక్క కారణం చెప్పలేమని ప్యానెల్ స్పష్టం చేసింది. కోవిడ్ తర్వాత తక్షణ మంటల వల్ల గుండెపోటు ఘటనలు ఎక్కువగా నమోదైన సంగతి నిజమే. అయినప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావం లేదనే చెప్పాలి. జయదేవా హాస్పిటల్ కు సంబంధించి అకాల గుండెపోటు కేసుల విషయంలో కోవిడ్‌కు ముందు, తర్వాత డేటాను సమీక్షించామని డాక్టర్ రవీంద్రనాథ్ అన్నారు. కోవిడ్ తర్వాత మధుమేహం, రక్తపోటు, ధూమపానం 5–6 శాతం పెరిగినట్టు గమనించాం. ఇది రోగుల ఆరోగ్య అలవాట్లలో మార్పును సూచిస్తుందని ఆయన అన్నారు.
ఎక్కువరోజులు కొవిడ్ తో ఉండటం, కోవిడ్ టీకా వల్ల కూడా యువకులలో ఆకస్మిక మరణాలకు కారణమనే వాదనలను కూడా ప్యానెల్ తోసిపుచ్చింది. అంతేకాకుండా, టీకాలు గుండె సమస్యల నుంచి దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయని సూచించే గ్లోబల్ డేటాను ప్యానెల్ ప్రస్తావించింది.
దీర్ఘకాలిక హృదయ సంబంధ సమస్యలను మరింత క్షుణ్ణంగా అన్వేషించడానికి భారీ స్థాయిలో, వివిధ-కేంద్ర అధ్యయనాలను కూడా ఈ ప్యానెల్ సిఫార్సు చేస్తుంది.ఈ రిపోర్ట్ పై ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రమాదమేమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మా పరిశోధన కూడా కోవిడ్ కు ఎటువంటి సంబంధం లేదని నిరూపిస్తోందని ' అన్నారు.






