- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka: లైంగిక వేధింపులపై వ్యాఖ్యలు.. దిగొచ్చిన కర్ణాటక హోంమంత్రి
లైంగిక వేధింపులపై కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర (G Parameshwara) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపులపై కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర (G Parameshwara) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఎట్టకేలకు ఆయన దిగొచ్చారు. క్షమాపణలు కోరారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాటిని వక్రీకరించారు. ఆ అవకాశాన్ని మరికొందరికి ఇవ్వాలనుకోవట్లేదు. నా వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో నేను ఉంటా. వారి క్షేమం కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాం. నా మాటలకు ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
యువతిపై లైంగిక దాడి
ఇటీవలే బెంగళూరులోని సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి వారిలో ఓ యువతిని అసభ్యంగా తాకి పరారయ్యాడు. ఏం జరుగుతుందో తెలియక షాక్ అయిన యువతులు భయంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే, ఈవిషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బెంగళూరు వంటి పెద్ద సిటీల్లో మహిళలపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతాయని మంత్రి జి పరమేశ్వర వ్యాఖఅయానించారు. దీనిపైనే నెటిజన్లు ఫైర్ అయ్యారు. కాగా.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైనే ఆయన వివరణ ఇచ్చారు.






