- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం ఎక్కువైతే మత్తు దిగేవరకూ ఉంచుతాం : కర్ణాటక హోంమంత్రి
న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్లుతాగి తూలే మందుబాబుల కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ అంటే చాలు.. అర్థరాత్రి వరకూ తాగడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. అలాంటి వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం తాగినవారితో పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారిని వారి ఇళ్లవద్ద దింపుతామని హోంమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు. ఈ బాధ్యతలను బెంగళూరు పోలీసులు చూసుకుంటారని తెలిపారు. అయితే.. ప్రతి ఒక్కరినీ ఇళ్ల వద్ద దింపడం వీలుకాదు కాబట్టి.. మందుబాబులకు ఎక్కిన కిక్కు దిగేంతవరకూ పోలీసుల పర్యవేక్షణలో ఉంచేందుకు 15 ప్రాంతాలను సిద్ధం చేశామన్నారు. ఇక తాగిన మత్తులో ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బార్లు, పబ్బుల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
కొన్ని జిల్లాలతో ఎలాంటి సమస్య లేదు కానీ.. బెంగళూరు, మైసూర్, హుబ్బళి, బెలగావి, మంగళూరులో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మహిళల భద్రతతో పాటు ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నగర వ్యాప్తంగా 20 వేల మంది పోలీసు సిబ్బంది మోహరించినట్లు చెప్పారు. వీరిలో మహిళా పోలీసుల టీమ్ కూడా ఉందన్నారు.






