Bengaluru: తొక్కిసలాటపై కర్నాటక సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

by Gantepaka Srikanth |

తొక్కిసలాట ఘటన(Bengaluru Stampede)పై కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు(Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bengaluru: తొక్కిసలాటపై కర్నాటక సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తొక్కిసలాట ఘటన(Bengaluru Stampede)పై కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు(Karnataka High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించి గురువారం విచారణ జరిపింది. అనంతరం సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. వేల సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా స్టేడియం వద్ద ఎందుకు అంబులెన్సులు ఏర్పాటు చేయలేదని సీరియస్ అయ్యింది. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ఈవెంట్‌ నిర్వహించడం ఏంటని మండిపడింది. తొక్కిసలాట ఘటనపై ఈనెల 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. స్వయంగా బాధితులను పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందిచి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

Next Story