- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bengaluru Stampede : తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్.. కమిషనర్ సస్పెండ్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద జరిగిన దుర్ఘటన(Bengaluru Stampede) కన్నడ సర్కార్ సీరియస్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద జరిగిన దుర్ఘటన(Bengaluru Stampede) కన్నడ సర్కార్ సీరియస్ అయింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకు పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. కాగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ విజయోత్సవ పరేడ్(Victory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి, విచారణను ప్రారంభించి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) సీఐడీ, జ్యూడీషియయల్ విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటనపై కన్నడ సర్కార్ మరిన్ని చర్యలకు దిగింది. బెంగళూరు సిటీ సీపీ బి. దయానంద్, ఏసీపీ (వెస్ట్ డివిజన్) వికాస్ కుమార్, డీసీపీ (సెంట్రల్ డివిజన్) శేఖర్ హెచ్.టి., మరో ఏసీపీ (కబ్బన్ పార్క్ డివిజన్) సి. బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ ఎ.కె.లను సస్పెండ్ చేసింది. ఈవెంట్ సందర్భంగా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, అభిమానుల రద్దీని నియంత్రించడంలో విఫలం చెదరంటూ ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసింది.
ఈ ఘటనలో ఏ1- ఆర్సీబీ, ఏ2-ఈవెంట్ మేనేజర్ DNA నెట్‌వర్క్, ఏ3- కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA)లను పేర్కొంటూ.. వీరిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.






