సీఐడీ చేతికి బెంగళూరు తొక్కిసలాట కేసు.. దర్యాప్తు ప్రారంభం!

by Phanindra |

సీఐడీ చేతికి బెంగళూరు తొక్కిసలాట కేసును కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. కేఎస్‌సీఏ ఆఫీసులో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.

సీఐడీ చేతికి బెంగళూరు తొక్కిసలాట కేసు.. దర్యాప్తు ప్రారంభం!
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసును సీఐడీకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆఫీసులో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇదే సమయంలో 11 మరణాలకు కారణమైన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహస్తూ కేఎస్‌సీఏ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ ఈఎస్ జైరామ్ రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రతిపక్ష బీజేపీ.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతులకు రక్తపు మరకలంటాయంటూ విమర్శలు చేసింది. ఈ ఘోరానికి సీఎం, డిప్యూటీ సీఎం కారణమని బీజేపీ ఆరోపణలు చేసింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఈ కేసు విచారణ జరగాలని డిమాండ్ చేసింది.

Next Story