Breaking News : ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలపై కర్ణాటక సర్కార్ నిషేధం

by Muthe.Rajitha |

కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Breaking News : ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలపై కర్ణాటక సర్కార్ నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ఓలా(Ola), ఉబర్(Uber), ర్యాపిడో(Rapido) వంటి యాప్ ఆధారిత సంస్థల బైక్ ట్యాక్సీ(Bike Taxy) సేవలపై నిషేధం(Ban) విధించింది. కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఈ సేవలను నిషేధించాలని ఆదేశించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల్లో వివరణాత్మక నివేదిక సమర్పించాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటోలకు మొదటి 2 కి.మీ.కి రూ. 30, ఆ తర్వాత కి.మీ.కి రూ. 15 ఛార్జీ ఉండాలి, కానీ ఈ సంస్థలు కనీసం రూ.100 వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రాగా 2022లో ఆయా సంస్థల నేతృత్వంలో పని చేస్తున్న ఆటోరిక్షాలపై ప్రభుత్వం నిషేధం విధించగా.. తాజాగా బైక్ ట్యాక్సీలపై కర్ణాటక హైకోర్ట్ నిషేధం విధించింది.

మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్-93ని అనుసరించి నిబంధనలు ఏర్పాటు చేసేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పింది. అపతి వరకు ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్లపై తిరగడానికి వీల్లేదని కోర్ట్ స్పష్టం చేసింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులు ఇవ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్ట్ కొట్టివేసింది. ఈ నిషేధం బెంగళూరు వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్థానిక ఆటో డ్రైవర్లు "నమ్మ యాత్రి"(Namma Yatri) వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Next Story