Praveen Sood :CBI Director. సీబీఐ కొత్త డైరెక్టర్గా ప్రవీణ్ సూద్..!

by Javid Pasha |   (  Updated:2023-05-14 12:11:21  IST  )

సీబీఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు.

Praveen Sood :CBI Director. సీబీఐ కొత్త డైరెక్టర్గా ప్రవీణ్ సూద్..!
X

దిశ, వెబ్ డెస్క్: సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సూచన మేరకు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. సీబీఐ డైరెక్టర్ రేసులో మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనాతో పాటు ఐపీఎస్ అధికారి తాజ్ హసన్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి.

కానీ ఉన్నత స్థాయి కమిటీ మాత్రం ప్రవీణ్ సూద్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవీలో కొనసాగనున్నారు. ఇక ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుంది. కాగా ప్రవీణ్ సూద్ 1986 కర్ణాటక కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి.

Also Read..

కేరళ స్టోరీస్ డైరెక్టర్ కు అనారోగ్యం

Next Story