- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
World Record: యోగాసనాలతో చిన్నారి వరల్డ్ రికార్డు.. 12 ఏళ్ల రిత్వీ కళ్లు చెదిరేలా ఆసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (International Yoga Day) అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Book of World Records) స్థానం సంపాదించింది. హసన్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి రిత్వీ (Ruthvi) చిన్న వయసులోనే యోగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆమె శరీరంలో ఎముకలు లేవా? అన్నట్లుగా కళ్లు చెదిరే ఆసనాలతో చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న రిత్వీ.. రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా పోటీల్లో అనేక అవార్డులు గెలుచుకుంది. తాజాగా అంతర్జాతీయ యోగా పోటీలో పాల్గొని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డును కైవసం చేసుకుంది. కఠినమైన బాక్స్ యోగా ఆసనం ద్వారా అద్భుతమైన యోగా స్కిల్స్ ప్రదర్శించి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె ఒక చిన్న పెట్టెలో ఉండి అందులోనే యోగాసనాలను ప్రదర్శించింది.
చిన్నారి రిత్వీ మీడియాతో మాట్లాడుతూ.. "నేను యోగా చేసినప్పుడు, నాకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. చదువుపై నాకు ఎక్కువ ఏకాగ్రత వస్తుంది. నేను ఒక నిమిషంలో పది ఆసనాలు వేశాను, అది నాకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. నేను అంతర్జాతీయ యోగా ఛాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను" అని తెలిపింది. తనకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యోగాభ్యాసం ప్రారంభించినట్లు చిన్నారి రిత్వీ తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగా చేస్తానని చెప్పింది. అలాగే ఇటీవల (yoga champion) యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్-2025లో పాల్గొని రిత్వీ రజత పతకాన్ని గెలుచుకుంది.






