Terror Attack : ఉగ్రదాడిలో కర్ణాటక వ్యాపారి మృతి.. వైరల్ అవుతున్న చివరి వీడియో

by Muthe.Rajitha |   (  Updated:2025-04-24 05:53:15  IST  )

జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) జరిపిన సంగతి తెలిసిందే.

Terror Attack : ఉగ్రదాడిలో కర్ణాటక వ్యాపారి మృతి.. వైరల్ అవుతున్న చివరి వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu & Kashmir) మంగళవారం ఉగ్రవాదులు దాడి(Terrorist Attack) జరిపిన సంగతి తెలిసిందే. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం(Pahalgoan)లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే(Tourists) లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇప్పటి వరకు 30 మంది టూరిస్టులు మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో మృతి చెందిన వారిలో ఒకరిని కర్ణాటకకు చెందిన మంజునాథ్(Manjunath) అనే వ్యాపావేత్త(Karnataka Businessman)గా అధికారులు గుర్తించారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో మంజునాథ్ కుటుంబంతో సహ జమ్ము కాశ్మీర్ పర్యటనకు వెళ్ళగా.. అక్కడ ముష్కరుల దాడిలో హతమయ్యాడు. అయితే మంజునాథ్ ను కాల్చిచంపే ముందు అతని పేరు, మతం వివరాలు అడిగినట్టు మృతుడి భార్య పల్లవి పేర్కొన్నారు.

తన భర్తను చంపేశారు, తనని, తన పిల్లల్ని కూడా చంపమని పల్లవి ప్రాధేయపడగా.. "నువు వెళ్ళి మీ మోడీకి ఈ విషయం చెప్పడానికైనా బతికి ఉండాలి" అని దుండగులు అన్నారని పల్లవి రోధించారు. దీనిని బట్టి ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే పర్యాటకుల ఐడీ కార్డులు చెక్‌ చేసి... పేరు, మతం అడిగి మరీ కాల్పులు జరిపారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక పెళ్లి చేసుకొని, హనీమూన్ కి వచ్చిన జంటలో భర్తను ముష్కరులు కాల్చి చంపగా.. మృతుని భార్య నిశ్చేష్టురాలు అయినట్టు సమాచారం. 30 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న దుశ్చర్యకు పాల్పడింది తామేనని పాకిస్తాన్(Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న TRF ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.

click for tweet ..

Next Story