karnataka: కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్.. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు

by B.Srinivas |

కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాపిడో, ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి.

karnataka: కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్.. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాపిడో (Rapido), ఉబర్ (Uber), ఓలా (Ola) సంస్థలు తమ సేవలను సోమవారం నుంచి నిలిపివేశాయి. కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను నిలిపివేస్తున్నట్టు రాపిడో తెలిపింది. సేవలను పునరుద్ధరించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించింది. సోమవారం ఉదయం ఓలా, ఉబర్ లు బైక్ రైడ్ సేవలు అందించాయి. అయితే మధ్యాహ్నం సమయానికి కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలు ఆగిపోయాయి. ‘హైకోర్టు ఆదేశం మేరకు జూన్ 16 నుంచి కర్ణాటకలో బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేయాలని ఉబర్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇది వారి రోజువారీ మొబిలిటీ అవసరాల కోసం బైక్ టాక్సీలపై ఆధారపడే వేలాది మంది రైడర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందరికీ సురక్షితమైన విధానాలను రూపొందించడానికి మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం’ అని ఉబర్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 93 కింద రాష్ట్ర నియమాలను రూపొందించే వరకు బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేయాలని ఏప్రిల్ 2న సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీనిని క్యాబ్ సర్వీస్ సంస్థలు సవాల్ చేసినప్పటికీ సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది.

Next Story