సంచలన పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-02 13:37:49  IST  )

కర్ణాటక ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అనర్హత వేటు! కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ధార్వాడ్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ సచివాలయం ప్రకటించింది.

సంచలన పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీలో అత్యంత వివాదాస్పద శాసన సభ్యుడు (MLA) వినయ్ కులకర్ణి (Vinay Kulkarni)పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు కర్ణాటక శాసనసభ సచివాలయం (Karnataka Legislative Assembly Secretariat) శనివారం అధికారిక నోటిఫికేషన్‌ (Official notification)ను విడుదల చేసింది. ఒక క్రిమినల్ కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు (Spl CC.No.565/2021) వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పు వెలువడిన తేదీ అయిన ఏప్రిల్ 15, 2026 నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8, రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(e) ప్రకారం, జైలు శిక్ష పూర్తయిన తర్వాత మరో ఆరేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు.

వినయ్ కులకర్ణి పై అనర్హత వేటు (Disqualification) పడడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధార్వాడ్ అసెంబ్లీ స్థానం (Dharwad Assembly constituency) ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి ప్రకటించారు. ఒకవేళ ఉన్నత న్యాయస్థానం ఈ శిక్షపై స్టే విధిస్తేనే ఆయనకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కాపీలను భారత ఎన్నికల సంఘం, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం కోసం పంపారు. దీంతో కొద్ది రోజుల్లోనే ధార్వాడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పరిణామం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story