Karge: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించండి.. ప్రధాని మోడీకి ఖర్గే లేఖ

by B.Srinivas |

లోక్‌సభలో ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Karge: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించండి.. ప్రధాని మోడీకి ఖర్గే లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు మోడీకి మంగళవారం ఓ లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటం అత్యంత ఆందోళనకరమైన విషయమని తెలిపారు. ఇది భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచిది కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 93లో పొందుపర్చిన నిబంధనలను ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కొన్నారు. గత రెండు పర్యాయాలుగా ఈ పదవి ఖాళీగా ఉందని తెలిపారు.

సభ గౌరవాన్ని, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని సూచించారు. కాగా, 17వ, ప్రస్తుత 18వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అంతకుముందు 16వ లోక్ సభలో 2014-2019 టైంలో ఏఐఏడీఎంకే నేత తంబీదురై డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుండి ఆ పదవి ఖాళీగా ఉంది.

Next Story