Karge: ఈసీ నిర్ణయాలతో బీజేపీకి మేలు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపణ

by B.Srinivas |

ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Karge: ఈసీ నిర్ణయాలతో బీజేపీకి మేలు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) ఆరోపించారు. ఈ మోసాన్ని ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇందిరా భవన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. హర్యానాలో మాదిరిగానే, ఎన్నికల సంఘం తీసుకున్న ప్రశ్నార్థక నిర్ణయాలు బీజేపీకి అనుకూలంగా ఫలితాలను మార్చాయని ఆరోపించారు. ‘పోలింగ్ కు ముందు తమ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తారు. లేదా పేరును తీసేసి పక్క బూత్‌లో నమోదు చేస్తారు. అంతేగాక కొత్త కొత్త పేర్లను జోడిస్తారు’ అని ఆరోపించారు. ఓటర్ల జాబితా తారుమారుకు సంబంధించి ఈ సవాల్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడం ద్వారా, ప్రభుత్వం ఆయన నిష్పాక్షికతను కూడా విశ్వసించడం లేదని స్పష్టమవుతుందన్నారు.

ఎన్నికల ఫలితాలకు రాష్ట్ర ఇన్‌చార్జులదే బాధ్యత

వివిధ రాష్ట్రాల్లో భవిష్యత్‌లో జరిగే ఎన్నికల ఫలితాలకు రాష్ట్ర ఇన్‌చార్జులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పార్టీలో జవాబుదారీ తనం అవసరరమని నొక్కి చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి చాలా మందిని తొందరపడి తీసుకుంటారని, కానీ సిద్ధాంతపరంగా బలహీనంగా ఉన్నవారు కష్ట సమయాల్లో పారిపోతారన్నారు. దీంతో అసలు పుస్తకం జారిపోచి, కాపీ మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. భారతదేశంపై అమెరికా సుంకాలను వ్యతిరేకించడంలో ప్రధాని విఫలమయ్యారని, ఇది దేశానికి, భారతీయులకు అవమానకరమని తెలిపారు. వనరులు లేకపోయినా ఢిల్లీలో కాంగ్రెస్ బలంగా పోరాడిందని కొనియాడారు.

Next Story