- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విస్తరిస్తోన్న #BoycottTurkey.. మరో యూనివర్శిటీతో ఒప్పందాలు రద్దు
టర్కీ యూనివర్సిటీలతో (Turkey University) ఒప్పందాలు చేసుకున్న భారత్ యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటాయి. తాజాగా ఆ లిస్టులోకి కాన్పూర్ వర్సిటీ (Kanpur Versity), ఐఐటీ రూర్కీ(IIT Roorkee) కూడా చేరాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ, అజార్ బైజాన్ దేశాలు పాక్ కు బాహాటంగా మద్దతు తెలపడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. టర్కీ టూరిజం (Turkey Tourism)ను భారత్ ప్రజలు బాయ్ కాట్ చేయడంతో అక్కడి టూరిజం ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇక టర్కీ యూనివర్సిటీలతో (Turkey University) ఒప్పందాలు చేసుకున్న భారత్ యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటాయి. తాజాగా ఆ లిస్టులోకి కాన్పూర్ వర్సిటీ (Kanpur Versity), ఐఐటీ రూర్కీ(IIT Roorkee) కూడా చేరాయి.
#BoycottTurkey దేశమంతా విస్తరిస్తున్న క్రమంలో ఇప్పటికే జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలు ఎంఓయూలను నిలిపివేశాయి. ఇప్పుడు కాన్పూర్ యూనివర్సిటీ, ఐఐటీ రూర్కీ కూడా ఇస్తాంబుల్ వర్సిటీ (Istanbul Versity)తో గతంలో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మరోవైపు భారత వ్యాపారులు టర్కీ నుంచి పండ్లు, ఇతర వస్తువుల దిగుమతులను స్వచ్ఛందంగా నిలిపివేశారు.






