- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగుళూరులో కన్నడ వర్సెస్ తమిళ్
బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్యక్రమంలో రచ్చరచ్చ జరిగింది. నగరంలోని ఫోరమ్ మాల్ లో లైవ్ వ్యూజిక్ ఏర్పాటు చేయగా అందులో కేవలం తమిళ పాటలు మాత్రమే వేయడంతో ఆందోళన మొదలైంది.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్యక్రమంలో రచ్చరచ్చ జరిగింది. నగరంలోని ఫోరమ్ మాల్ లో లైవ్ వ్యూజిక్ ఏర్పాటు చేయగా అందులో కేవలం తమిళ పాటలు మాత్రమే వేయడంతో ఆందోళన మొదలైంది. బెంగళూరు ఉన్నది కర్ణాటకలో అలాంటిది కన్నడ పాటలు వేయకపోవడం, కనీసం బోర్డు కూడా పెట్టకపోవడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. దీంతో అక్కడకు చేరుకున్న కర్ణాటక రక్షణ వేదికే అనే కన్నడ మద్దతు దారులు భాషా ప్రాతిపదికన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై ఆందోళన చేపట్టారు. తమిళ పాటలను వెంటనే ఆపేసి కన్నడ పాటలు ప్లే చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే చాలా కాలంగా తమిళ్ వర్సెస్ కన్నడ నినాదాలు వినిపిస్తున్నాయి. కన్నడ భాష తమిళం నుండే పుట్టింది అంటూ అప్పట్లో నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తరవాత కన్నడీకులు కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఆ తరవాత కమల్ తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళనలు విరమించుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి అక్కడ కన్నడ వర్సెస్ తమిళ్ వివాదం మొదల్వడం హాట్ టాపిక్ గా మారింది.






