రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి

by velandi.Saikiran |

రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేంద్ర

రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి
X

రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి

* తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు

* జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు మద్దతు ప్రకటించిన కనిమొళి

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు ఆమె మద్దతు ప్రకటించారు. అనంతరం ఢిల్లీ వేదికగా ఎంపీ కనిమొళి మాట్లాడారు. . రిజర్వేషన్ల పరిమితిని సవరించాలని వస్తున్న డిమాండ్ లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రిజర్వేషన్ల అంశంలో వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళినాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని ఉద్ఘాటించారు. పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఉందని గుర్తుచేశారు. దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంపునకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తోందని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని స్థాయిల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలు చేసే పోరాటానికి డీఎంకే మద్దతు ఉంటుందని ఎంపీ కనిమొళి పేర్కొన్నారు.

Next Story