- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: బీజేపీ ఎంపీ కంగనా ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్లు
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది. తనసలు నివాసమే ఉండని ఇంటికి ఎడాపెడా బిల్లు వేసిన ప్రభుత్వంపై నిప్పులు చెరికింది. ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ.. “దేశం అంతటా ప్రధాని మోడీ, బీజేపీ వేవ్ ఉంది. కానీ, హిమాచల్ లో కాంగ్రెస్ దయనీయమైన పరిస్థితిని సృష్టించింది. వారి ఏజెన్సీలు సమోసా కేసులపై విచారణ చేస్తున్నాయి. ఏమి జరుగుతుందో చూసి మేం. మీరు క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనాలీలో ఉన్న నా ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు వేశారు. నేను నివసించని ఇంటికి ఈ రేంజ్‌లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నాను. సోదరసోదరీమణులారా.. మన రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం మనందరి బాధ్యత. అలా చేయాలంటే ఇలాంటి తోడేళ్ల నుంచి మన రాష్ట్రానికి విముక్తి కల్పించాలి” అని చెప్పుకొచ్చింది.
కాంగ్రెస్ విమర్శలు
కాగా.. కంనగా రనౌత్ వ్యాఖ్యలపై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు "అన్యాయం", "బాధ్యతారాహిత్యం" అని పేర్కొంది. కాంగ్రెస్ తప్పు చేసిందనే ఆరోపణలను తోసిపుచ్చింది. బహిరంగ ఆరోపణలు చేయడం కంటే తగిన అధికారిక మార్గాల ద్వారా అటువంటి సమస్యలను పరిష్కరించాలని కంగనాకు పిలుపునిచ్చింది. "ఇది కంగనా తరఫున అన్యాయం. దీనిపై ఆమెకు బాధ్యత ఉంది. చౌకబారు ప్రచారం కోసం ఆమె ఇలాంటి ప్రకటన చేశారు. దీనిపై, ఆమె సంబంధిత అధికారులకు లేఖ రాయాలి. ఆమెపై ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకునే ప్రశ్నే లేదు" అని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు, కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ముంతాజ్ పటేల్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆమె ఆలోచించకుండా మాట్లాడుతుందని, ఆమెకు షూట్ ఔట్ ఆఫ్ మౌత్ సిండ్రోమ్ ఉందని అన్నారు.






