- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ స్పీచ్ వినడం పెద్ద తలనొప్పి : కంగనా రనౌత్
రాహుల్ స్పీచ్ వినడం పెద్ద తలనొప్పి అంటూ విమర్శలు చేశారు కంగనా రనౌత్.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పైన చర్చ జరగగా, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన కంగనా, రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ వినడం పెద్ద తలనొప్పిగా మారిపోయిందని చురకలు అంటించారు. రాహుల్ గాంధీ చైల్డ్ వుడ్ ట్రామాస్ ను గుర్తు చేసినట్లు సెటైర్లు పేల్చారు.
అదో న్యూసెన్స్ స్పీచ్ అంటూ మండిపడ్డారు. స్పీకర్ కూడా ఆయన ప్రసంగాన్ని ఆపాలని కోరినట్లు పరువు తీశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్లమెంటును అపహాస్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కంగనా రనౌత్. అయితే కంగనా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేని వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు, మహిళల సాధికారత కోసం పెట్టింది కాదని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని.. దానిని అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.






