- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి నోరు జారిన కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చొరబాటుదారులను “శరీరంలో క్యాన్సర్ లాంటివారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వారిని దేశం నుంచి తరిమేయాలని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR)ను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ మంగళవారం SIRకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టి, ఎన్నికల సంఘాన్ని "బిజేపి కమిషన్" అని మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరిగితే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు.
మమతా విమర్శలపై కంగనా ఇలాంటి ఘాటు రిప్లై ఇచ్చారు. అయోధ్య రామమందిర ధ్వజారోహణపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటనపై కూడా కంగనా ఆగ్రహం వ్యక్తం చేసారు. పాకిస్థాన్ భిక్షాటన పాత్రగా మారింది, ఓ వైపు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళుతుంటే.. పాక్ మాత్రం ప్రపంచం ముందు అడుక్కునే పాత్రగా మారిందని ఫైర్ అయ్యారు.






