- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంబళ పోటీల్లో సరికొత్త రికార్డ్
దున్నపోతుల పందెం.. కర్ణాటకలో అనాదిగా వస్తోన్న సంప్రదాయం. కంబళగా పిలుచుకునే ఈ పందేల్లో సరికొత్త రికార్డు నమోదయింది.

దిశ, వెబ్‌డెస్క్: దున్నపోతుల పందెం.. కర్ణాటకలో అనాదిగా వస్తోన్న సంప్రదాయం. కంబళగా పిలుచుకునే ఈ పందేల్లో సరికొత్త రికార్డు నమోదయింది. ఈ ఏడాది జరిగన పోటీల్లో మస్తికట్టె స్వరూప్ అనే యువకుడు విజేతగా నిలిచారు. మంగళూరులో జరిగిన కంబళ రేసులో 125 మీటర్లను కేవలం 10.87 సెకన్లలో పూర్తి చేశాడు. దీని ప్రకారం అతను 100 మీటర్లను 8.69 సెకన్లలో అధిగమించాడు. మూడేళ్లుగా కంబళ పోటీల్లో పాల్గొంటున్నానని, ఈ ఏడాది సీనయర్ విభాగంలో ఊహించని విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు స్వరూప్. గతంలో ఈ రికార్డు శ్రీనివాస గౌడపై ఉండేది. అతను 100 మీటర్లను 8.78 సెకన్లలో పూర్తి చేయగా.. స్వరూప్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
డిసెంబర్ 27,28 తేదీల్లో జరిగిన కంబళ పోటీల్లో సీనియర్ కేటగిరీ ఫైనల్స్ లో బడగబెట్టు సందీప్ శెట్టికి చెందిన దున్నపోతులు కేవలం 10.87 సెకన్ల వ్యవధిలో 125 మీటర్లు పూర్తిచేసి కొత్త రికార్డు సృష్టించాయి. ఈ సందర్భంగా సందీప్ శెట్టి మాట్లాడుతూ.. తాడులాగే పోటీల్లో తన దున్నలు రెండో స్థానంలో నిలిచాయన్నారు. స్వరూప్ సీనియర్ పోటీల్లో పాల్గొని రికార్డు నెలకొల్పాడని అభినందించారు.






