Kamal Haasan: రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్న కమల్ హాసన్

by Shamantha N |

నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత క‌మ‌ల్ హాస‌న్‌(Kamal Haasan) రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్టుతో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు.

Kamal Haasan: రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్న కమల్ హాసన్
X

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత క‌మ‌ల్ హాస‌న్‌(Kamal Haasan) రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్టుతో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్ ను ఎగువ సభఖు పంపాలన్న అంశంపై మక్కల్ నీది మయ్యం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్‌ఎం రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై డీఎంకే కూడా ఇదే ప్రకటన చేసింది. తమిళనాడులో అధికార డీఎంకే, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ మధ్య గతంలో ఓ రాజకీయ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారమే తాజాగా రెండు పార్టీల నుంచి ప్రకటన వచ్చింది.

వివాదస్పద వ్యాఖ్యలు

మరోవైపు, తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ నటుడు కమల్‌హాసన్ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన థగ్‌లైఫ్‌ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ‘నటుడు శివరాజ్‌కుమార్‌ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్‌ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్‌ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా? అని ధ్వజమెత్తారు.

Next Story