- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందీ మాపై రుద్దొద్దు.. ఇంగ్లీషులో 350 ఏళ్ల విద్య.. మార్చేస్తే ఇబ్బందులు: కమల్ హాసన్
హిందీ రుద్దడం సరికాదని కమల్ హాసన్ అన్నారు. ఇంగ్లీషులో 350 ఏళ్లుగా విద్య జరుగుతోందని, దీన్ని మార్చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: త్రిభాషా సూత్రంపై స్టార్ యాక్టర్, తమిళనాడు పొలిటీషియన్ కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దక్షిణాదిపై హిందీ బలవంతంగా రుద్దడాన్ని ఆయన వ్యతిరేకించారు. ‘నేను పంజాబ్, కర్ణాటక, ఆంధ్రలకు మద్దతిస్తాను. కేవలం తమిళనాడు ఒక్కటే ఈ విధానాన్ని వ్యతిరేకించడం లేదు. బలవంతంగా రుద్దకపోయినా అవసరముంటే నేర్చుకుంటాం. అంతేకానీ రుద్దకండి. ఎందుకంటే ఇది విద్యకు సంబంధించిన విషయం. విద్యలో షార్ట్‌కట్‌లో వెళ్లాలి. అనవసరంగా అడ్డంకులు సృష్టించకూడదు’ అని హాసన్ చెప్పారు.
‘ఇంగ్లీషు భాషలో విద్య మంచిదే. అవసరమైతే స్పానిష్ లేదా చైనీస్ నేర్పించండి. షార్టెస్ట్ మార్గంలో వెళ్లడానికి ఉన్న మార్గం ఇంగ్లీష్, ఎందుకంటే మనం 350 ఏళ్ల ఇంగ్లీషు విద్యను చూశాం. నెమ్మదిగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీన్ని సడెన్‌గా రిప్లేస్ చేసి, మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. దీని వల్ల అనవసరంగా ఎంతోమంది నిరక్షరాస్యులుగా మారతారు. ఈ ప్రభావం తమిళనాడులో మరీ ఎక్కువగా ఉంటుంది’ అని కమల్ వివరించారు.
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లోని త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీ ముసుగులో హిందీని దక్షిణాదిపై రుద్దడమే బీజేపీ సర్కారు లక్ష్యమని డీఎంకే వాదిస్తోంది.






