- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇమ్రాన్‌ఖాన్‌ను వెంటనే వదిలిపెట్టండి లేదంటే.. పాకిస్థాన్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే పాకిస్థాన్ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ అమీర్‌తో తాను మాట్లాడానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. లేదంటే పాకిస్థాన్ మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ అమీర్‌తో తాను మాట్లాడానని చెప్పారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నట్టు చెప్పాడన్నారు. ఇది గొప్ప వార్త అని పేర్కొన్నారు. పాకిస్థాన్ నాయకులను తాను హెచ్చరిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ ను మంచిగా ట్రీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ ను కలిసి మాట్లాడేందుకు ఆయన సోదరులకు అనుమతి ఇవ్వాలన్నారు. మావవహక్కులను కాలరాయవద్దని పాకిస్థాన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారు అంటూ వార్తలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వార్తలతో పాకిస్థాన్ లో ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో వార్తలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ జైలులో క్షేమంగానే ఉన్నారన్నారు. బయట కంటే సౌకర్యవంతంగా ఉన్నారని ఫైవ్ స్టార్ హోటల్ కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించామని ప్రకటించారు. ఆయన భోజనం చేస్తున్నారని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.






