- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం - KA పాల్
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం పై KA పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం పై KA పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. 242 మంది ప్రయాణికులు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంపై (Air India Plane Crash).. పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్ర ( Pakistani terrorists) చేశారని.. ఈ సంఘటనపై వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్ ( Ka Paul). ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణమని... మరణించిన వారికి సంతాపం కూడా తెలిపారు. విమాన ప్రమాద సంఘటన... బ్లాక్ డే అంటూ ఎమోషనల్ అయ్యారు కే ఏ పాల్.
ఇది ఇలా ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో.. అందులో ప్రయాణించిన 242 మంది మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విమానంలో ప్రయాణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ (Former Gujarat CM Vijay Rupani ) కూడా మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విమానంలో ప్రయాణించిన ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని సిపి జ్ఞానేంద్ర సింగ్ ( CP Gyanendra Singh) కూడా వెల్లడించారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Dr K A Paul’s demand to investigate AI Flight 171 accident if it is a terrorist attack ? Condolences to all family members . pic.twitter.com/S7eLjMwK1m
— Dr KA Paul (@KAPaulOfficial) June 12, 2025






