2029 నాటికి మూడేళ్లలోపే న్యాయం: అమిత్ షా సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

2029 నాటికి మూడేళ్లలోపే న్యాయం: అమిత్ షా సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రకటించారు. శనివారం శ్రీ విజయపురంలో జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశం (Parliamentary Consultative Committee Meeting)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ ఫలితాల విశ్లేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగిస్తామని, పెండింగ్‌లో ఉన్న కేసులను మిషన్ మోడ్‌లో పరిష్కరించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నేరాల మ్యాపింగ్ కోసం త్వరలోనే 'మోడస్ ఆపరేండి బ్యూరో'ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా 2029 నాటికి దేశంలో ఒక అద్భుతమైన వ్యవస్థను తీసుకువస్తామని, దీని ద్వారా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు అయినప్పటి నుండి సుప్రీంకోర్టు తీర్పు వరకు మొత్తం న్యాయ ప్రక్రియ మూడేళ్లలోనే పూర్తవుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. గతంలో ఏళ్ల తరబడి సాగే విచారణలకు స్వస్తి పలికి, బాధితులకు సకాలంలో న్యాయం అందించేలా 2022 నుంచి తాము చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి నేర పరిశోధనలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే ఈ భారీ పెట్టుబడి ఉద్దేశమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరించారు.

Next Story