వీధి కుక్కల వల్ల పాపులర్ అయ్యా..జస్టిస్ విక్రమ్ నాథ్ సరదా వ్యాఖ్యలు

by Phanindra |

వీధి కుక్కల వల్ల తాను పాపులర్ అయ్యానని జస్టిస్ విక్రమ్ నాథ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వీధికుక్కలపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించారు.

వీధి కుక్కల వల్ల పాపులర్ అయ్యా..జస్టిస్ విక్రమ్ నాథ్ సరదా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వీధి కుక్కల వల్ల తనకు గ్లోబల్ గుర్తింపు దక్కిందంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. మనుషులు-జంతువుల మధ్య తలెత్తే సమస్యలపై తిరువనంతపురంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సరదా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ విక్రమ్ నాథ్.. ‘నన్ను ఇంత పాపులర్ చేసిన వీధికుక్కలకు రుణపడి ఉంటాను. కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచం అంతా నాకు గుర్తింపె తెచ్చాయి’ అన్నారు. న్యాయవ్యవస్థలో చేసిన పనికి తనకు పెద్దగా గుర్తింపు రాలేదని, అలాంటి తనకు గుర్తింపు తెచ్చినందుకు వీధి కుక్కలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని జోకులు పేల్చారు.

ఢిల్లీ వీధికుక్కల అంశంపై తీర్పు తర్వాత తనకు ఎంతోమంది శునక ప్రేమికుల నుంచి మెసేజ్‌లు వచ్చాయని, తనకు వారితోపాటు ఆ శునకాల ఆశీస్సులు కూడా ఉంటాయని వారు చెప్పారని ఆయన అన్నారు. ఇలా సరదాగా మాట్లాడిన ఆయన ఈ కేసును తనకు అప్పగించిన సీజేఐ బీఆర్ గవాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల లా ఏసియా పీఓఎల్‌ఏ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా తనకు ఈ కేసు గురించే ప్రశ్నలు ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు.

Next Story